Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 32,937 మందికి కరోనా పాజిటీవ్ రాగా 417 మంది మృతి చెందారు. అలాగే కొత్తగా 35,909 మంది కరోనాను జయించారు. ఈ మేరకు వివరాలను ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది ఇప్పటివరకు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,31,342 మంది ఇప్పటివరకు ప్రాణాలను కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా 54.58కుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
దేశంలో ఆదివారం 11,81,212 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 49,48,05,652కు చేరింది. కొత్తగా 17,43,114 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54,58,57,108 టీకా డోసులు పంపిణీ చేశారు.