Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల వనపర్తిలో బర్రెపై లైంగికదాడి చేస్తూ దాని తోక మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకు ముందే అలాంటి తరహా మరో ఘటన వెలుగు చూసింది. ఈ సారి బర్రెపై లైంగికదాడి చేస్తుండగా అది చూసిన స్థానికులు అతన్ని చితకబాదారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం విజయ కాలనీకి చెందిన రమేశ్ శనివారం రాత్రి వేళ ఫుల్లుగా మందు తాగాడు. ఆ తర్వాత ఓ గేదెపై లైంగిక దాడికి దిగాడు. అది చూసిన స్థానికులు.. అతన్ని లాక్కొచ్చి అతడు నగ్న స్థితిలో ఉండగానే చితకబాదారు. తాళ్లతో ఓ గుంజకు కట్టేసి నిర్బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.