Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొందరు తండ్రులు తమ కూతర్ల పట్ల ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా కన్న కూతురిని ఓ తండ్రి.. లైంగికదాడి చేయిస్తానని బెదిరించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే ఆ యువతిని ఇల్లు వదిలి ఎటైనా వెళ్లిపోవాలని ఆమె తండ్రి కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. లేదంటే లైంగికదాడి చేయిస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా ఆ తండ్రి అతని భార్య, కూతురితో గొడవపడ్డాడు. అది తట్టుకోలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
తన తల్లి పేరుతో హైదరాబాద్లోనే కొంత ఆస్తి ఉందని, దానికి సంబంధించిన అద్దెను కూడా తన తండ్రే వసూలు చేసుకుంటాడని చెప్పింది. తమ డబ్బులు వాడు కుంటూ తమపై దాడికి దిగుతున్నాడని, ఇదేంటని అడిగితే లైంగికదాడి చేయిస్తానంటూ బెదిరింపులు చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.