Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంది. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉందని ప్రజాప్రతినిధులు తమ ఉపన్యాసాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో దళితులకు ఇంకా స్వేచ్ఛ రాలేదు. వారి మీద దాడులు మనం రోజూ చూస్తున్నాం. అలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఒక దళిత సర్పంచ్ జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో అక్కడి గ్రామ కార్యదర్శి అతనిపై దాడి చేశాడు.
స్థానికులు తెలిపిన వివరాలప్రకారం. బుందేల్ ఖండ్లో ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్పూర్లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు.దాంతో గ్రామస్తులు సర్పంచ్ హన్ను బాసర్ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు సర్పంచ్ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గ్రామ కార్యదర్శి ఆగ్రహంతో తనను కాదని.. జెండా ఎలా ఎగురవేశావని సర్పంచ్ పై పడిగుద్దులు కురిపించాడు. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య, కోడలిపై కూడా దాడిచేశాడు. దాంతో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.