Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు( గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ) కూడిన వర్షములు కొన్ని జిల్లాలల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.