Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్‌పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. త్వరలోనే బండి సంజయ్‌ని బట్టలిప్పి రోడ్డుపై నిలబెడతానన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సంజయ్‌ని బరాబర్ తిడతానని స్పష్టం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం బయట పెడతానని ప్రకటించారు.