Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి రికార్డు స్థాయిలో 55,680కి చేరుకుంది. అయితే ఆ తర్వాత ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 55,582కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 16,563 వద్ద స్థిరపడింది.