Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సిఆర్బిఇ (CBRE)సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ‘‘తెలంగాణ- భారతదేశంలోని పారిశ్రామిక &వేర్‌హౌసింగ్‌కు ఒక ప్రకాశవంతమైన కేంద్రం’’ అనే నివేదికను ఆగస్టు 14న హైదరాబాద్‌లో క్రెడాయ్‌తో కలిసి నిర్వహించిన ఒక ప్రాపర్టీ షోలో విడుదల చేసింది. ఇ-కామర్స్ మరియు 3 పిఎల్ ప్లేయర్ల ద్వారా వృద్ధి చెందుతున్న డిమాండ్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక నేపథ్యం కలిగిన హైదరాబాద్‌లో గోదాముల కార్యకలాపాలు విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర రాజధానిలో కీలకమైన మౌలిక సదుపాయాలు ఉన్నందున, తెలంగాణలో గోదాముల విభాగాన్ని ముందుకు తీసుకు వెళడంతో హైదరాబాద్ ఎలా కీలకపాత్ర పోషించిందనే అంశాన్ని నివేదికలో విస్తృతంగా వివరించారు. సరఫరా నాణ్యత పరంగా కనిపించే మార్పుకు సాక్ష్యంగా, నగరంలో మొత్తం గోదాముల స్టాక్H1 2021 నాటికి సుమారు 21 మిలియన్ చ. అడుగులకు చేరుకుంది. రానున్న మూడేళ్లలో అదనంగా 5 మిలియన్ చ. అడుగులు దీనికి జోడించబడుతుందని అంచనా. మౌలిక సదుపాయాల ద్వారా అందించిన మద్ధతుతో పాటు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ (TS-iPASS)తో సహా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు రాష్ట్ర పారిశ్రామిక &గిడ్డంగుల (I&W) విభాగం అభివృద్ధికి తోడ్పడ్డాయి. సిబిఆర్ఇ (CBRE)నివేదిక ప్రకారం, 2018-H1లో హైదరాబాద్‌లో గోదాములు దాదాపు 11 మిలియన్ చ.అడుగుల విస్తీర్ణంలో ఉండగా, లీజింగ్ ప్రధానంగా సెమీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రాపర్టీలలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (H1 2021) వేర్‌హౌస్ లీజింగ్‌ను ప్రధానంగా రిటైల్ ప్లేయర్స్ (43%), తర్వాత 3PL (19%) మరియు ఇ-కామర్స్ కంపెనీలు (15%)కీలక పాత్రను పోషించాయి. అలాగే, గత మూడేళ్లుగా సగటు డీల్ పరిమాణం స్థిరమైన వేగంతో వృద్ధి చెందుతుండగా, ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో పెద్ద స్థలాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.
పెద్ద-పరిమాణం లోని స్థలాలను లీజుకు తీసుకునేందుకు ముందుకు వచ్చే వారి నుంచి డిమాండ్‌తో పాటు మెరుగైన-నాణ్యమైన గోదాములను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లోని మైక్రో మార్కెట్లలో H1 2021 సమయంలో అద్దె విలువలు దాదాపు 5-14% పెరిగాయి. నివేదిక గురించి భారతదేశం &ఆగ్నేయాసియా, మిడల్ ఈస్ట్ &ఆఫ్రికా, సిబిఆర్ఇ (CBRE)ఛైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్మాట్లాడుతూ, “దేశంలో I & W రంగాన్ని ప్రోత్సహించాలనే అచంచలమైన లక్ష్యంపై దృష్టి సారించిన విధానపరమైన కార్యక్రమాలతో, భారతదేశం అభివృద్ధి చెందుతుండగా, ప్రత్యామ్నాయ సప్లయ్ చెయిన్ మరియు తయారీ గమ్యస్థానంగా, దేశంలో గోదాముల రంగానికి ఒక పూరణను అందిస్తోంది. దేశసమగ్ర అభివృద్ధికి దృఢమైన మౌలిక సదుపాయాల ప్రోత్సాహంతో పాటుగా తెలంగాణ విధాన కార్యక్రమాలు కూడా మద్ధతుగా నిలిచాయి’’ అని వివరించారు.
హైదరాబాద్ I&W సెక్టార్‌కు ఒక రూనాన్ని అందిస్తున్న కొన్ని కీలకమైన ట్రెండ్లు:
1. ప్రభుత్వ పాలసీలు
· రెగ్యులేటరీ ప్రేరణ: పాలసీ జోక్యాలు మరియు అంకితభావం కలిగిన సెక్టోరల్ పాలసీలు రాష్ట్ర I&W రంగంలో పెట్టుబడులను పెంచుతాయని అంచనా.
· మౌలిక సదుపాయాల కార్యక్రమాలు: పారిశ్రామిక కారిడార్ల ప్రతిపాదనలు మరియు ప్రాంతీయ రింగ్ రోడ్డు అభివృద్ధి లాజిస్టిక్స్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు మద్ధతుగా నిలవడంతో, హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడింది.
2. సప్లయ్ చెయిన్ షిఫ్ట్
· సరఫరా గొలుసు వైవిధ్యీకరణ: ‘‘నెట్వర్క్’’ సప్లయ్ చెయిన్ నమూనాను తయారీదారులు స్వీకరించే అవకాశం ఉండగా, ఇది మరింత చురుకైనది, స్థిరమైనది మరియు బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లకు స్థితిస్థాపకంగా ఉంటుంది.
3. ఆక్యుపైయర్ పోకడలు
· ఇ-కామర్స్ నేతృత్వంలోని డిమాండ్: ఓమ్నిచానెల్ నుంచి రిటైలింగ్‌కు మారడాన్ని మహమ్మారి వేగవంతం చేయడంతో ఇ-కామర్స్ గోదాముల లీజింగ్ డిమాండ్‌కు నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.
· ఆక్యుపైయర్ల సెంటిమెంట్‌ని మెరుగుపరచడం: గోదాముల సేవలను వినియోగించే ఎక్కువ మంది దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి పెట్టుబడి-గ్రేడ్, కంప్లైంట్ స్పేస్‌లను గుర్తించడం వైపు మొగ్గు చూపుతారు.
4. ఆక్యుపైయర్ పోకడలు
· నాణ్యమైన ఆర్ఇ స్టాక్: ఇన్వెస్ట్మెంట్-గ్రేడ్ ప్రాజెక్ట్‌లు రాబోయే సరఫరాలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది
· వృద్ధి చెందిన పెట్టుబడిదారుల సెంటిమెంట్: బలమైన ఫండమెంటల్స్ మరియు నిరంతర అద్దె వృద్ధి I&W రంగం వైపు మదుపరుల ఆసక్తిని మరింతగా పెంచే అవకాశం ఉంది
భారతదేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, గత ఐదేళ్లలో దేశంలో గోదాముల లీజు 100 మిలియన్ చదరపు అడుగులను అధిగమించగా, చారిత్రాత్మక లీజింగ్ గరిష్ట స్థాయి 32 మిలియన్ చదరపు అడుగులకు 2019లో చేరుకుంది. ఇంకా, గత ఐదేళ్లలో సప్లయ్ అదనంగా భారతదేశంలో ఇది 75 మిలియన్ చ. అడుగులు దాటింది, కీలక నగరాలు ప్రపంచ మరియు జాతీయ డెవలపర్ల ద్వారా గోదాముల ప్రారంభాలను వృద్ధి చేస్తున్నాయి. మొత్తం సరఫరాలో ప్రముఖ గ్లోబల్/ నేషనల్ డెవలపర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసిన వాటా 2018 వరకు 12% కంటే తక్కువ నుంచి 2019 కన్నా ముందుగానే ఇది 20% కన్నా వృద్ధి చెందింది.
అదనంగా, ప్రస్తుత పరిస్థితుల్లో,చురుకైన సప్లయ్ చెయిన్‌కు డిమాండ్ వృద్ధి చెందుతుండగా, ఇది ఎండ్-టు-ఎండ్ నియంత్రణకు మరియు రిస్క్ మిటిగేషన్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్కి వెళ్లడానికి ఉద్దేశించబడింది. అలాగే, 3డి ప్రింటింగ్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) వంటి సదుపాయాలు / సప్లయ్ చెయిన్‌లో సాంకేతికతను అమలు చేయడంపై తయారీదారులు CAPEXని పెంచడంపై దృష్టి సారించడంతో ఈ రంగం అన్ని సమయాల్లో స్థిరంగా ఉండేలా చేస్తోంది.
భారతదేశంలోనిI&W పర్యావరణ వ్యవస్థ మొత్తం డైనమిక్స్ మరియు అనుకూల జనాభా గణాంకాలు, తక్కువ కార్మిక వ్యయాలు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు విధాన సంస్కరణలపై నిరంతర జోక్యం కారణంగా ప్రత్యామ్నాయ సరఫరా గొలుసు గమ్యస్థానంగా దాని పెరుగుతున్న అవకాశాలను నివేదిక మరింత హైలైట్ చేసింది.