Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెల్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికదాడికి పాల్పడ్డారు. గదిలో బంధించి మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులుగా అఘాత్యానికి ఒడిగట్టారు. గది నుంచి చెల్లి తప్పించుకోగా అక్క ఆచూకీ లేదు. దీంతో చిలకలగూడ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ల్యాబ్ టెక్నిషియన్ ఉమామహేశ్వర్ లైంగికదాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఉమ మహేశ్వర్‌తో మరో ఇద్దరు గార్డులు లైంగికదాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. లాబ్ టెక్నీషన్ ఉమమహేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.