Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ శాసనసభ సమావేశం ఏర్పాటు చెయ్యమని రేవంత్ కోరారు.. మా పార్టీ శాసనసభ పక్ష నేత దళితుడు.. ఏడేళ్ళల్లో దళిత గిరిజనులను కేసీఆర్ వంచించారు. కేసీఆర్ ను బజారు కీడ్చి.. బంజరు దొడ్డిలోకి పంపుతామని హెచ్చరించారు. దళిత బంధు కాదు.. కేసీఆర్ రాబంధు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారు. కేసీఆర్ ఆ కుర్చీ మీద నీకు ఎందుకు మమకారంౌ ఎప్పడు వుంటావా? అని రేవంత్ కామెంట్స్ చేశారు.