Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాటి,ఈత చెట్ల పన్నులను రద్దుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడల, పర్యాటక, యువజన సర్వీసులు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తి రక్షణకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రాహానికి పూల మాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. పాపన్న గౌడ్ పేదోళ్ళ దేవుడని, బహుజనులను కలుపుకొని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అని కొనియాడారు.