Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయానికి దగ్గర అవుతుంది. టీ విరామం తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(33) ఔటయ్యాడు. దాంతో భారత్‌కు భారీ ఉపశమనం లభించింది. మూడో బంతికి రూట్ స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. దాంతో ఆ జట్టు 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ బ్రేక్‌కు ముందు ఇషాంత్ వేసిన చివరి బంతికి బెయిర్‌స్టో(2) వికెట్లముందు దొరికిపోయాడు. భారత విజయానికి ఇంకా ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజులో బట్లర్, మోయిన్ అలీ ఉన్నారు.