Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించిన దళిత ద్రోహులకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు చేస్తే తట్టుకునే ఓపిక లేక దాడులు చేయించే సంస్కృతి మీది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దానికి సమాధానం చెప్పే దమ్ము లేక అనుచరులతో బూతు పురన్నాని మొదలు పెట్టి, విమర్శించిన వారిపైన ఒక రౌడీ మూక తయారు చేసి స్వైరవిహారం చేయిస్తుంది ఎవరో అందరికీ తెలుసని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
రాజ్యాంగ బద్ధంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడిన దళిత బిడ్డను నేను తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా ఫ్యాక్షన్, కొట్లాటలు మాత్రమే కనిపించేవి , గడిచిన ఏడున్నర సంవత్సరాలు ఎలాంటి రాజకీయ ఘర్షణలకు ఇక్కడ తావులేకుండా అభివృద్ధి ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతున్నం తుంగతుర్తి లో కులాలు, వర్గాలను ప్రోత్సహిస్తూ మళ్ళీ ఘర్షణలు సృష్టిస్తుంది మీరు, ఇలాంటివి దయచేసి మానుకోండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా విజ్ఞత, ఓపిక ఉండాలి, కొన్ని విషయాలు రాజకీయంగా మీకు తెలియకపోతే తెలుసుకోండి. కేసీఆర్ గారిని విమర్శిస్తే నాయకులు కారు కేసీఆర్ గారి కంటే గొప్పగా ఆలోచించి ప్రజల పట్ల చిత్తశుద్ధి వుంటే ప్రజలే మనల్ని నాయకుల్ని చేస్తారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.