Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ట్రయల్‌గా ఇవాళ రైతుల ఖాతాల్లోకి రూ. 25,100 చొప్పున బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తొలిరోజు 1,309 మంది రైతుల ఖాతాల్లో రూ. 3.27 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 30 వరకు రుణమాఫీ నిధుల జమ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. నెలాఖరులోపు 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ జరిగిన రైతులకు కొత్త రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. రూ. 25 నుంచి మొదలు పెట్టి 50 వేల వరకు మాఫీ చేస్తామని, రైతుబంధు తరహాలోనే రుణమాఫీ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.