Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇద్దరు బాలికలపై లైంగికదాడి చేసిన కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మైలార్ దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 2016 నవంబర్ 3న తేదీన ఇద్దరు బాలికలపై లైంగికదాడి జరిగినట్లు న్యాయస్థానం తేల్చింది. ఈ ఘటనలో బాలికల తల్లితో పాటు లైంగికదాడికి పాల్పడిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. వీరితో పాటు మరో ముగ్గురు మైనర్లు కూడా లైంగికదాడికి పాల్పడినట్లు అప్పట్లో కేసు నమోదైంది. దీనిపై బాల నేరస్తుల న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. 9 ఏళ్ల వయసున్న ఇద్దరి బాలికలపై తల్లి సాయంతో దోషులు లైంగికదాడికి పాల్పడినట్లు మైలార్ దేవ్పల్లి పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించారు. న్యాయస్థానం తీర్పు పట్ల సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్, దర్యాప్తు అధికారులు ఇందిర, అనురాధలను అభినందించారు.