Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై మరో కేసు నమోదు అయింది. మల్కాజ్‌గిరిలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి చేశారన్న అభియోగంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మైనంపల్లి హన్మంతరావుపై మరో కేసు నమోదైంది. మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్ మైనంపల్లి నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మైనంపల్లిపై 324,427,504,506,148 R/W 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక, టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ.. సోమవారం నేరెడ్‌మెట్‌లో నిరసన చేపట్టిన తమపై ఎమ్మెల్యే మైనంపల్లి సహా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే సునీత శేఖర్ కారు ధ్వంసమైందని తెలిపింది.
సోమవారం మల్కాజ్‌గిరిలోని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. జెండా ఆవిష్కరణ కోసం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సర్కిల్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మధ్య జరిగిన వాదనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు మారాయి. మైనంపల్లి హన్మంతరావు దాడి చేయడంతో తమ కార్పొరేటర్ శ్రవణ్ గాయపడినట్టుగా బీజేపీ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించి స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. హన్మంతరావు ఫాల్త్గాడనే బీజేపీలో చేర్చుకోలేదంటూ కామెంట్ చేశారు. హన్మంతరావు కబ్జాలు చేస్తాడని.. పైసలతో రాజకీయాలు చేస్తాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే బండి సంజయ్ తనపై చేసిన విమర్శలను హన్మంతరావు అదే స్థాయిలో తిప్పికొట్టారు. బండి సంజయ్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతానని అన్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని తెలిపారు.