Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. షూటింగ్లు స్తంభించడం, థియేటర్స్ మూతపడడంతో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి పలువురు సినీ పెద్దలతో పలుమార్లు మీటింగ్లు జరిపారు.తాజాగా మరోసారి చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంతా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి సినీ పరిశ్రమకు సంబంధించి చర్చించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాల్సిన అన్ని అంశాల గురించి ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయం ముఖ్యమంత్రి జగన్తో చర్చించాలనీ, చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో అనుమతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనీ తీర్మానించారు.