Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ లో అత్యంగా వేగంగా మారుతున్న పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు తాలిబన్ నేతలతో రష్యా రాయబారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఈ చర్చలు ఫలిస్తే ఆఫ్ఘనిస్థాన్ లోకి రష్యా మరోసారి ప్రవేశించే అవకాశం ఉంది. వాస్తవానికి గతంలో కూడా ఆఫ్ఘన్లకు రష్యా సహకారం అందించింది. 1979 ప్రాంతంలో ఆఫ్ఘన్ కు రష్యా అండగా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పటి సోవియట్ యూనియన్ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యన్ బలగాలు వెనక్కి మళ్లాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్ఘన్ కు సహకారం అందించేందుకు రష్యా ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు తాలిబన్లకు సహకరిస్తామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రష్యా రాయబారి భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.