Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. గూడూరు మండలం సోమ్లా తండాలో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్‌నాయక్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. గంట సేపు అక్కడే ఉన్న షర్మిల సునీల్ నాయక్ కుటుంబీకులను ఓదార్చారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా ప్రతి మంగళవారం చేపడుతున్న నిరుద్యోగ దీక్షలో భాగంగా ఆమె గుండెంగ గ్రామంలో నిరాహార దీక్షలో కూర్చున్నారు.