Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు వడివడిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులందరికీ క్షమాభిక్షను కల్పిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్ల నుంచి ఈ ప్రకటన వెలువడింది. ప్రతి ప్రభుత్వ అధికారికి క్షమాభిక్ష వర్తిస్తుందని ప్రకటలో తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ పూర్తి విశ్వాసంతో విధుల్లోకి చేరాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనాలని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాలిబన్ల ప్రకటన నేపత్యంలో అక్కడి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.