Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మరో రెండు చార్జ్ షీట్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఏడు చార్జ్షీట్లు దాఖలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో చార్జ్షీట్లను ఈడీ కోర్టుకు సమర్పించింది. జగన్ సహా పలువురిపై అభియోగాలను పేర్కొంది.
వాన్పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ గతంలో పేర్కొంది. వాటికి సంబంధించిన అక్రమ లావాదేవీల చెలామణిపై సుదీర్ఘ దర్యాప్తు జరిపిన ఈడీ... గతంలోనే పలు ఆస్తులు అటాచ్ చేసింది. వాన్పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లో ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.