Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదక్: మెదక్ జిల్లా మనోహరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కలుషితాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. వారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మనోహరాబాద్ సమీపంలోని కోళ్ల ఫాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల తల్లిని తుప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తుప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మనీషా(13), కుమార్(10)గా గుర్తించారు.