Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీకి చికిత్స కోసం వచ్చిన ఇద్దరు మహిళలపై గాంధీ ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఇలాంటి ఘటన జరగటంపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీలో ప్రైవేట్ సెక్యూరిటీని మార్చాలన్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ను బీజేపీ మహిళ మోర్చా ముట్టడించింది.