Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా సోకిందన్న బాధతో దంపతులు.. పోలీసులకు ఫోన్ చసి చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ కుమార్, గుణ లు భార్యభర్తలు. వాళ్లు మంగళూరు చిత్రపూర్లోని రహేజా అపార్ట్మెంట్లో నివాసిస్తున్నారు. ఇటీవల రమేశ్.. స్థానిక పోలీసు అధికారికి వాయిస్ మెసేజ్ పెట్టాడు తనకు, తన భార్యకు కరోనా సోకిందని కావున ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. తమ అంత్యక్రియలు జరిపించాలని కోరారు. అయితే ఆ పోలీసుల అధికారి వారికి వెంటనే స్పందించి ఆత్మహత్యకు చేసుకోవద్దని చెప్పాడు. కానీ రమేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఫోన్ ను ట్రేస్ చేసి 20 నిమిషాల్లో వారున్న అపార్టుమెంట్ కు పోలీసు సిబ్బందికరోనా సోకిందని దంపతుల ఆత్మహత్య..అంతకు ముందు పోలీసులకు ఫోన్ వెళ్లారు. కానీ అప్పటికే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
.అయితే వారు ఇంకో వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ అంత్యక్రియలకు రూ.లక్షను ఉంచుతున్నామని అందులో చెప్పారు. అలాగే అక్కడ గుణ రాసిన ఓ సూసైడ్ లేఖ కూడా ఉంది. అందులో 'నాకు కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ ఉన్నవారిలో కండ్లు పోవడం, ఇతర శరీర భాగాలు పాడవడం జరుగుతుండడం మనం చూస్తున్నాం. నాక్కుడా అలాగే జరుగుతుందని భయం వేస్తోంది. నా భర్తకు కరోనా ఉంది. అలాగే నేను జన్మనిచ్చిన బిడ్డ 13 రోజులకే చనిపోయింది. నాకు డయాబెటిస్ కూడా ఉండడంతో రోజూ రెండు ఇన్సులిన్ తీసుకుంటున్నాను` అంటూ తన బాధను వ్యక్తం చేసింది. అందుకే చనిపోదామని నిర్ణయించుకున్నామని తెలిపింది. తన ఇంట్లో ఉన్న సామానును పేదలకు పంచాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.