Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీటెక్ విద్యార్థిని రమ్య హత్యను సైతం ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నాయని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. దిశ చట్టం వచ్చిన తర్వాత 1647 కసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఏడురోజుల్లోనే ఈ కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేశామన్నారు.
బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య ఘటనలోనిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టుగా హోంమంత్రి సుచరిత చెప్పారు.నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 39 లక్షల మంది మహిళలు దిశయాప్ ను డౌన్ లోడ్ చేసుకొన్నారని మంత్రి తెలిపారు. దిశ యాప్‌నకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దళితులపై దాడులు గత రెండేండ్లలో భారీగా తగ్గాయని హోంమంత్రి తెలిపారు.