Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లు, ఓ హెలీకాప్టర్ తో పారిపోయాడని ఆరోపించింది. అందుకు తమ వద్ద సాక్ష్యలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధ్రువీకరించారు.
తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా చెబుతోంది. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయిని, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్లో నింపడానికి ప్రయత్నించగా అది సరిపోక పోవడంతో వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది. మరోవైపు తాము తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది.