Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఐటీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడి 55,792కి చేరుకుంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 16,615కి ఎగబాకింది.