Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సోలార్ స్కామ్ కేసుకు సంబంధించి మహిళా వ్యాపారవేత్తను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాష్, హిబి ఎడెన్, ఎంఎల్ఏ ఏపీ అనిల్ కుమార్లపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అబ్దుల్లాకుట్టి పేరును కూడా ప్రస్తావించారు. తిరువనంతపురం, కొచ్చిలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో సీబీఐ ఎఫ్ఐఆర్ను సమర్పించింది. సీబీఐ తిరువనంతపురం యూనిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను సీబీఐకి అప్పగించింది. సోలార్ ప్రాజెక్టుల గురించి వివరించేందుకు వెళ్లిన సమయంలో నిందితులు లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రుల అధికారిక నివాసాలు, ఎమ్మెల్యే హాస్టళ్లు, హోటల్ గదుల్లో తనను వేధింపులకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. 2018లో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.