Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాఇబన్లకు చైనా హెచ్చరిక జారీ చేసింది. అఫ్ఘనిస్తాన్ ను మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మార్చొద్దని తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితిపై భద్రతా మండలిలో సోమవారం భారత్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో చైనా ఉప శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్ ఎంత మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మరోసారి మారకూడదని చెప్పారు. ఆ దేశంలో భవిష్యత్తు రాజకీయ పరిష్కారాలకు ఇదే కీలకమని స్పష్టం చేశారు. తాలిబన్లు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని, ఉగ్రవాద సంస్థలతో తెగదెంపులు చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చాలన్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, ఎటిమ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్లో అరాచకాన్ని తమకు అనుకూలంగా మలచుకోకుండా ఉగ్రవాద సంస్థలను నిరోధించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది.