Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆడపిల్ల అంటే నేటి సమాజంలో చిన్నచూపే. దేశంలో ఎక్కడో ఒక చోట ఆడపిల్లల పుడితే చంపేయడం గానీ, వదిలేయడం గానీ లేదా కడుపులో ఉండగానే చంపేయడం గానీ చేస్తున్నారు. తాజాగా ముంబైలో తన భార్య మగపిల్లాడినే కనాలని ఓ భర్త.. ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు.
ముంబైకి చెందిన ఓ మహిళకు 2007లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఆమె భర్త, అత్త ఇద్దరూ లాయర్లు కాగా.. ఆడపడుచు ఓ డాక్టర్. అయితే అత్తమామలు, భర్త తమ వంశాన్ని నిలబెట్టేందుకు మగబిడ్డ కావాలని పెండ్లయిన నాటి నుంచే ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె 2009లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మళ్లీ 2011లో ఆమె మరోసారి గర్భం దాల్చగా ఈసారి ఆమె భర్త ముందే ఆమెను ఓ డాక్టర్‌కు దగ్గరకు తీసుకెళ్లి లింగనిర్థారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. ఆమెకు ఇస్టం లేకపోయినా ఇలా వరుసగా ఆమెకు ఎనిమిదిసార్లు అబార్షన్లు చేయించాడు. అనంతరం ఆమెను ఆమె భర్త బ్యాంక్‌కి తీసుకెళ్లి గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేయించాడు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ పద్ధతి మన దేశంలో నిషేధించడంతో అతను ఆమెను బ్యాంకాక్‌కి తీసుకెళ్లాడు. దీని గురించి ఆమెకు ముందుగా తెలియకపోయినా విషయం తెలుసుకున్న తర్వాత ఆమె ఇది భరించలేక అత్తామామలపైనా, భర్తపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.