Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లలో రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు.మంగళవారం సెన్సెక్స్ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. ప్రారంభంలో దేశీ సూచీలు నష్టాలను చవి చూసినా తిరిగి కోలుకుని లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం 51 పాయింట్లు లాభపడి 16,614 పాయింట్ల వద్ద ముగిసింది.