Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధాని మోడీని విమర్శించాడన్న ఆరోపణలపై తమిళనాడుకు చెందిన 62 ఏండ్ల వృద్దుడు మన్మోహన్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన్మోహన్ ఇటీవల తన యూట్యూబ్ చానల్లో ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ విధానాలు, నిర్ణయాలు, కోవిడ్ సంబంధించిన పనులనుద్దేశించి మాట్లాడారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చర్యలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో యూపీ పోలీసులు చెన్నైకు చేరుకుని..స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మన్మోహన్ను అరెస్టు చేసిన తర్వాత...మాధవరం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయన్ను రిమాండ్కు తరలించింది. మన్మోహన్ స్వస్థలం యూపీలోని జానాపూర్ కాగా 35 ఏండ్ల క్రితం చెన్నైకు వచ్చి నివసిస్తున్నారు.