Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ ఆస్పత్రి లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనకు కారణమని భావిస్తూ..నలుగురు ఆస్పత్రి సిబ్బందిని వారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఒక టెక్నిషియన్, ఒకరు సెక్యూరిటి సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఇతరులను కూడ అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాధిత మహిళ కనిపించిన స్థలంలో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఓపీ పక్కన ఉన్న షెడ్లో ఎక్కడా సీసీ కెమెరా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు ఘటన జరిగిన స్థలంలో కనిపించిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.బాధితురాలి సోదరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రి సూపరిండెంట్ సైతం ఘటనపై స్పందించారు. ఘటనపై కమిటీ వేశామని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు కాకుండా అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు.