Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుండగా తాజాగా ఆ సమయంలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం మంగళవారం కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల కర్ఫ్యూ వరకు సడలింపులుంటాయని నిర్నయం తీసుకున్నారు. అలాగే పెండ్లీల విషయంలోనూ నిబంధనలు విధించారు. పెండ్లీలు, ఇతర ఫంక్షన్లకు 150 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఒకవేళ అర్ధరాత్రిగానీ, తెల్లవారుజామునగానీ ముహూర్తాలు ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.