Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హోంవర్క్ సరిగ్గా చేయడంలేదని ఓ బాలుడిని ట్యూషన్ టీచర్ చితకబాదింది. బాలునికి ఒళ్లంతా వాతలు పడడంతో పోలీసులకు బాలుని తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడడంతో బాపూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన 8 ఏండ్ల కుమారుడిని వెంగళరావునగర్‌లో ఉండే టీచర్ విజయలక్ష్మి వద్దకు ట్యూషన్‌కు పంపుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు హోంవర్క్ సరిగా చేయకపోవడంతో అతన్ని ఒకరోజు ఆమె చితకబాదింది. కుమారుడి ఒంటిపై దెబ్బలను చూసిన బాలుడి తండ్రి బాలుడిని ఏమైందని అడిగాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టిందని చెప్పాడు. దాంతో బాలుడి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.