Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన మేనమామాతో కలిసి తల్లి గొంతు కోసి హత్యాయత్నాం చేశాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ కు చెందిన లక్ష్మికి ఆమె కుమారుడు రవికి మధ్య కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రవి తన మేనమామ ప్రవీణ్‌తో కలిసి తల్లి లక్ష్మి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్థానికులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.