Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎకో జోన్ పై ఏపీ సర్కారు పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పులుల అభయారణ్యాన్ని విస్తరిస్తూ ఎకో సెన్సిటివ్ జోన్ గా ఏపీ ప్రతిపాదించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపుతూ కేంద్ర అటవీశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ప్రాంతాలకు ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తింపునిచ్చింది. పులుల అభయారణ్యం విస్తరించిన రిజర్వ్ ప్రాంతాలు ఇకపై ఎకో జోన్ పరిధిలోకి వస్తాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం 3,727.82 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొత్తగా 2,149 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తిస్తున్నట్టు కేంద్ర అటవీశాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.