Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25పైగా పెంచడంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5కు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.834.50గా ఉండేది. అంతకు ముందు జూలై 1న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 గా ఉంది. కోల్కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.861 నుంచి రూ.886కు పెరిగింది. ఈ రోజు నుంచి చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.850.50 నుంచి రూ.875.50కు పెరిగింది. హైదరాబాద్లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్పీజీ ధర) ధరలను మారుస్తాయి.