Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు చొచ్చుకురావడంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు-1 అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అందరు నేతలను కలుస్తున్నానని, ఏకాభిప్రాయం దిశగా మద్దతు కూడగడుతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం... దేశాధ్యక్షుడు పరారీలో ఉన్నా, దేశాధ్యక్షుడి గైర్హాజరీలోనూ ఉపాధ్యక్షుడు-1 దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతాడు. ప్రస్తుతం నేను దేశంలోనే ఉన్నాను. నేనే చట్టబద్ధమైన ఆపద్ధర్మ పాలకుడ్ని. ఈ క్రమంలో ఏకగ్రీవం దిశగా అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా అని అమృల్లా సలేహ్ వివరించారు.