Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. మిషన్ భగీరథ తాగు నీటి అవసరాల కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారన్నారు. ఆవిరి, లీకేజీ రూపంలో 617 క్యూసెక్కులు పోతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం1091.00 అడుగులు(90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1089.10 అడుగుల (80.139 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు.