Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నగరంలో బురఖాల ధరలు పదిరెట్లు పెరిగాయి. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘాన్ లో మహిళలు భయపడి బుర్ఖాలు ధరిస్తున్నారు. దీంతో బురఖాల కోసం విపరీతంగా డిమాండ్ పెరగడంతో వీటి ధరలు ఆకాశన్నంటాయి.గతంలో తాలిబాన్ల పాలనలో మహిళలు తమ శరీరంతోపాటు ముఖాన్ని బుర్ఖాలో కప్పుకునేవారు. మగ బంధవు లేకుండా మహిళలు ఇల్లు దాటి బయటకు రావడాన్ని తాలిబాన్లు నిషేధించారు. కాబూల్ నగరంలోని ఓ కుటుంబంలో మహిళకు సోదరి, తల్లి ఉండగా రెండు బుర్ఖాలు మాత్రమే ఉన్నాయి.బురఖా లేకపోతే ఒక బెడ్ షీట్ అయినా కప్పుకోవాలని ఆఫ్ఘాన్ మహిళ చెప్పారు.