Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒక్క కొవిడ్ కేసు నమోదయ్యేసరికి న్యూజిలాండ్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. తక్షణం దేశమంతటా మూడు రోజుల కఠిన లాక్‌డౌన్‌ను విధించింది. కొత్తగా అక్లాండ్లో ఒక వ్యక్తికి వైరస్ సోకింది. అతను ఇటీవల దేశంలోని కోరమాండల్ ద్వీపకల్పానికి వెళ్లినట్లు తేలడంతో.. ఈ రెండు చోట్ల 7 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మంగళవారం ప్రకటించారు. మహమ్మారిని అంతం చేయకపోతే వాటిల్లే నష్టాన్ని భరించలేమని.. అందువల్ల అదుపు చేయడానికి 50 లక్షల దేశ జనాభా కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే ప్రజలు అధిక సంఖ్యలో నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరారు. ప్రపంచమంతా కొవిడ్‌తో అల్లాడుతుంటే న్యూజిలాండ్ మాత్రం కఠిన చర్యలు చేపట్టి.. ఫిబ్రవరిలోనే మహమ్మారిని రూపుమాపింది. తాజాగా ఇప్పుడు ఓ కేసు బయటపడింది.