Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సింహులు అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. దాసరి నారాయణరావు వద్ద నర్సింహులు పనిచేశారు. ఆ పనికి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో వివాదం కొనసాగుతోంది. డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ తనను దూషించాడని రెండురోజుల ముందు నర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.