Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. పరిస్థితుల దృష్ట్యా ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఉపాధ్యక్షడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో తాలిబన్లపై తిరుగుబాటు జరిగింది. తాలిబన్లతో జరిగిన పోరులో చారికర్ ప్రాంతాన్ని అఫ్ఘాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. కాగా పంజ్‌షేర్ ప్రాంతంలో అఫ్ఘాన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి.