Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్యాంకు ఖాతా నుంచి మహిళకు తెలియకుండానే డబ్బును స్వాహా చేశారు సైబర్‌నేరగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి శాంతినగర్‌లో నివాసముండే శ్రీదేవి అనే మహిళకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 13న రూ.29వేలు డెబిట్ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. కలకత్తాకు చెందిన యోనో లావాదేవీల పేరుతో డబ్బు విత్‌డ్రా అయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం కూకట్పల్లి పోలీ్సస్టేషన్లోని సైబర్ నేర విభాగంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.