Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్ సలీమా మజారీ పట్టుబడ్డారు. తాలిబాన్ల రాకతో చాలామంది అఫ్ఘనిస్థాన్ రాజకీయ నాయకులు దేశం విడిచి పారిపోతున్న సమయంలో మహిళా గవర్నర్ సలీమా మజారీ బాల్ఖ్ ప్రావిన్సులో తాలిబాన్లకు లొంగిపోయారు. తాలిబాన్ తిరుగుబాటుదారులు అఫ్ఘాన్ దేశంపై నియంత్రణ సాధించిన తర్వాత దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సహా పలువురు దేశం విడిచి పారిపోయారు. కాని గతంలో తాలిబాన్లపై పోరాడేందుకు తుపాకీ చేత పట్టిన సలీమా మాజారీ వారికి చిక్కారు. మహిళా గవర్నరు అయిన సలీమా భయపడి దేశం విడిచి పారిపోకుండా అత్యంత ధైర్యసాహసం చూపారు. చార్కింట్ గవర్నరుగా పనిచేసిన సలీమా మజారి రైతులు, గొర్రెల కాపరులు, కార్మికులతో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడారు.