Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్‌లో బాల్య వివాహాన్ని చైల్డ్ లైన్ సంస్థ అధికారులు అడ్డుకున్నారు. 16 సంవత్సరాల బాలికకు కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ అధికారులు షీ టీమ్‌తో కలిసి బాలిక వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్‌పై దాడి చేశారు. వివాహాన్ని అడ్డుకొని బాలికను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.