Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, వివేక్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్స్ రాజేషం గౌడ్, నాగేందర్ గౌడ్, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటి చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ మరియు వివిధ గౌడ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.