Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన టప్పాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని జిర్రా ప్రాంతంలో జరిగింది. టప్పాచపుత్ర జిర్రా ప్రాంతానికి చెందిన షేక్ అక్రమ్ (32) క్యాబ్ డ్రైవర్. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన అక్రమ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ సంతో్‌షకుమార్ తెలిపారు.