Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విషం తాగి రామయ్య(42), బాలిక(17) బలవన్మరణానికి యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. రామయ్యకు బుచ్చిరెడ్డిపాలెంలో చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.